150 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు కనిపించింది.

  0
  197

  150 సంవత్సరాల తర్వాత.. షెల్లీస్ ఈగల్ అనే అత్యంత అరుదైన గుడ్లగూబ కనిపించింది. దీన్ని చివరి సారిగా 1870వ సంవత్సరంలో చూశారు. ప్రస్తుతం ఇది ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ లో పక్షి శాస్త్రజ్ఞుల కంటపడింది. గుడ్లగూబల్లోకే అతి పెద్దదైన ఈ షెల్లీస్ ఈగల్ ఉనికిపై గత 25ఏళ్లుగా శాస్త్రవేత్తలు అన్వేషణ చేస్తున్నారు. ఈ నెల 16వతేదీ ఘనా లోని అటెవా అడవుల్లో దీన్ని కనుగొన్నారు. మొదటిసారిగా దీని కదలికలను ఒక రాడార్ ద్వారా గుర్తించారు. ఆ తర్వాత రెండేళ్లపాటు ఇది ఎక్కడుందో కనుక్కోవాలని అడవులు మొత్తం గాలించి ఎట్టకేలకు కీకారణ్యంలోని ఓ చెట్టుపై దీన్ని గుర్తించారు.

  2 అడుగుల పొడవు ఉండే ఈ గుడ్లగూబ వాటి జాతుల్లోకన్నిటికీ చాలా పెద్దది. దీని ముక్కు ఇనుప కడ్డీకంటే అత్యంత బలమైనది. అంతరించిపోయిందని అనుకున్న షెల్లీస్ ఈగల్ ను ఎట్టకేలకు కనుగొన్నామని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బెల్జియన్ జూ లో మాత్రమే ఇది ఉండేది. 1975లో అది చనిపోయింది. జూ లో మాత్రమే చివరి గుడ్లగూబను చూశారు. ఇప్పుడు ప్రకృతి ఒడిలో, అడవుల్లో 150 ఏళ్ల తర్వాత దీన్ని చూశామన్న ఆనందంలో పక్షి శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో సంబరాలు జరుపుకున్నారు. దీంతో అటెవా రెయిన్ ఫారెస్ట్ ను సురక్షిత గుడ్లగూబల కేంద్రంగా ప్రకటించి అక్కడ ఇంకెన్ని ఉన్నాయనే విషయంపై పరిశోధన చేస్తున్నారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..