ఆ కలెక్టర్ అక్కడే ప్రసవించింది..

    0
    200

    ఆమే ఐఏఎస్ అధికారిణి, ఆమె భర్త ఐపీఎస్ అధికారి. వైద్యం కోసం ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో అయినే చేరే స్థోమత ఉంది. కానీ ఆ ఐఏఎస్ అధికారి మాత్రం తన తొలి కాన్పుకోసం ఓ ప్రభుత్వ ఆస్పత్రినే ఆశ్రయించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.తెలంగాణలోని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ స్నేహలత, మణుగూరు ఏఎస్పీ శబరీష్ దంపతులు. స్నేహలత ఖమ్మంలో పనిచేసే క్రమంలో ఆమె గర్భవతి అయినప్పటినుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యసహాయం పొందుతున్నారు. నెలనెలా జనరల్ చెకప్ అంతా అక్కడే. నెలలు నిండిన తర్వాత ప్రసవానికి కూడా అదే ఆస్పత్రిని ఆమె ఎంపిక చేసుకున్నారు.

    ప్రభుత్వ ఆస్పత్రి అనే చిన్నచూపు లేకుండా జనరల్ ఆస్పత్రిలనే చేరి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చించి స్నేహలత.నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు.. అనేది పాత నానుడి. ఇప్పుడు సర్కారు దవాఖానల్లో కూడా మంచి సౌకర్యాలున్నాయి, బాగా వైద్యం చేసే డాక్టర్లున్నారు. అయితే ప్రజల్లో ఉన్న అపోహలు పోగొట్టాల్సిన అధికారులు, నేతలు సైతం ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా జేసీ స్నేహలత జనరల్ ఆస్పత్రిలో ప్రసవించిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తల్లీబిడ్డను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వెళ్లి పరామర్శించారు. స్నేహలత, శబరీష్ దంపతులను ఆయన అభినందించారు.

     

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..