లేడీ టీచర్ జీవితం చివరకు ఏమైందంటే..?

    0
    480

    ఆమె ఓ ప్రభుత్వ టీచర్, భర్తకి కూడా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. కలతలు లేనికాపురం, ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ వారికున్న లోపం ఒకటే. ఎనిమిదేళ్లుగా వారికి పిల్లలు లేరు. దీంతో భర్తకి రోజు రోజుకీ భార్యపై ద్వేషం పెరిగింది, దాంతోపాటు అనుమానం కూడా పెరిగింది. వేధింపులు మొదలయ్యాయి. చివరకు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
    కర్నూలులో పాతబస్తీ బాపూజీనగర్‌ కు చెందిన భారతి.. ఇనకండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం మేనత్త కుమారుడు గోపీకృష్ణతో వివాహమైంది. అతను స్థానిక గాంధీనగర్‌ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సంతానం లేదనే కారణంతో.. భర్త ఆమెను అనుమానిస్తూ, గొడ్రాలివని అవమానిస్తుండటంతో భార్య మనస్తాపానికి గురైంది. ఉరేసుకుని చనిపోయింది. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి అక్క సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గోపీకృష్ణపై ఆత్మహత్య ప్రేరణ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..