ప్రాణాపాయం రోగికి ఊపిరితిత్తులు డ్రోన్ లో.

  0
  127

  ప్రపంచంలో మొట్టమొదటి సరిగా డ్రోన్ నుంచి ఒక పేషెంట్ కు అమర్చాల్సిన ఊపిరి తిత్తులను తరలించారు. అంబులెన్సు కంటే కదలకుండా.. త్వరగా డ్రోన్ సాయంతో తరలించడం.. ప్రపంచంలోనే ఇది రెండవసారి.. మొదట 2019లో ఒక కిడ్నీని అమెరికాలోని మేరీ ల్యాండ్ హాస్పిటల్ కు డ్రోన్ ద్వారా తరలించారు. ఇప్పుడు కెనడా లోని టొరంటో హాస్పిటల్ నుంచి ఈ ఊపిరితిత్తులను ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మరొక హాస్పిటల్ కు తరలించారు. రాత్రి సమయంలో ఆకాశ మార్గంలో 15 కిలోల బరువున్న కార్బన్ ఫైబర్బాక్సులో ఎలక్ట్రిక్ డ్రోన్ లో ఊపిరితిత్తులను పంపించారు. ఈ ఊపిరితిత్తులు రోగి ఉండే హాస్పిటల్ రూఫ్ టాప్ మీదకు చేరుకున్న అనంతరం.. సర్జికల్ టీం పేషెంట్ కు అమర్చారు. ఈ ఊపిరితిత్తులు అమర్చుకున్న ఇంజినీర్ రెండు రోజుల అనంతరం తన కూతురు పెళ్లి కూడా చేసుకున్నాడు. ట్రాఫిక్ కీకారణ్యంలో ఇలా తరలించేకంటే.. డ్రోన్ ద్వారా తరలించడం ఉత్తమమని వైద్యులు చెప్పారు. ఈ డ్రోన్ లోని రెఫ్రిజిరేటర్ వంటి పరికరం కూడా ఉంటుంది. అది సంబంధిత అవయవానికి ఎంత టెంపరేచర్ ఉండాలో అంతే మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ డ్రోన్ విఫలమైతే దానికి రిమోట్ పారాచూట్ కూడా ప్రత్యమ్నాయంగా అమర్చి వుంటారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..