ఆ పువ్వు పూయలేదని అధికారికి 6 నెలలు జైలు.

    0
    173

    ఓ పువ్వు మొగ్గగానే ఉందని, ఆ పువ్వు పూయలేదని ఆ తోట బాధ్యతలు చూసే అధికారికి 6 నెలలు జైలు, తోటమాలీలకు లేబర్ క్యాంప్ లో శిక్ష. ఇదెక్కడో అనాగరిక కాలంలోనో, రాక్షస యుగంలోనే జరిగింది కాదు. చుట్టూ ఇనుప తెరల మధ్య బతికే ఉత్తర కొరియాలో జరిగింది. నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, రాక్షసత్వానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పెట్టింది పేరు.

    ఇప్పుడు తన తండ్రి జిమ్ జోంగ్-2 జయంతి నాటికి కిమ్ జోంగ్ ఇల్లా బిగోనియాస్ అనే పూలు పూయలేదని ఆ తోటమాలికి తోటను పర్యవేక్షించే అధికారికి ఇలాంటి కఠినమైన శిక్ష విధించాడు. దీన్ని అమర పుష్పం అని కూడా అంటారు. ఒక తోటలో అరుదైన ఈ పూలను పెంచి వాటికి కిమ్ జోంగ్ అని తన తండ్రి పేరు పెట్టుకున్నాడు. ఆ పూలు.. తండ్రి జయంతి నాటికి పూసే విధంగా ఒక గ్రీన్ హౌస్ ని కూడా ఏర్పాటు చేశాడు. ఏడాదికోసారి మాత్రమే ఈ పూలు పూస్తాయి. అది కూడా కిమ్ జోంగ్-2 జయంతి రోజుకి ఆ పూలు పూయాలి. ఇదీ ఆ రాక్షస నియంత పెట్టిన నియమం.

    అయితే ఈ దఫా జయంతి నాటికి ఆ పూలు పూయలేదు. అందువల్ల తోట పెంపకంలో నిర్లక్ష్యం వహించినందుకు తోటను పర్యవేక్షించే అధికారికి 6నెలల జైలు శిక్ష వేశారు. తోటలో కూలీలను లేబర్ క్యాంప్ కి పంపించి అత్యంత కఠినంగా శిక్షించారు. గత డిసెంబర్లో తన తండ్రి వర్థంతి రోజున 11 రోజులు ఉత్తర కొరియాలో ఎవరూ నవ్వకూడదని, పార్కులకు పోకూడదని, పంక్షన్లు చేసుకోకూడదని, ఇళ్లలో కూడా బర్త్ డే లు లాంటి కార్యక్రమాలు జరుపుకోకూడదని, మద్యం తాగకూడదని, బయట షాపింగ్ చేయకూడదని సాయంత్రం 5 తర్వాత బయట ప్రజలు తిరగకూడదని నిబంధనలు విధించారు. వర్థంతి సందర్భంగా 11రోజులు ఉత్తర కొరియా ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. ఎటువంటి వేడుకలు, వినోదాలు లేకుండా ఇళ్లలోనే ఉండిపోయారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..