సెల్ఫీ మోజులో నలుగురు యువకులు మృతి .

    0
    184

    సెల్ఫీ మోజులో రైలు వస్తుండగా మొబైల్ తో పట్టాలపై నిలబడి ఫోజులిచ్చిన నలుగురు యువకులను రైలు ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే తునాతునకలైపోయారు. గుర్ గావ్ లో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ వస్తున్న సమయంలో 18నుంచి 21 ఏళ్ల వయసున్న నలుగురు యువకులు సమీర్, మహ్మద్ అనాస్, యూసఫ్, యువరాజ్, సెల్ఫీకోసం నిలబడ్డారు. రైలు తమవెనకనుంచి పోతున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలన్నది వారి తాపత్రయం.

    అయితే ఈ నలుగురు రైలు డ్రైవర్ బోగీకి ఉన్న స్టెప్స్ బాక్స్ తగిలి చనిపోయారు. ఇటీవలే కొన్నిరోజుల క్రితం ఇద్దరు అమ్మాయిలు అక్కడే అద ప్లేస్ లో సెల్ఫీ దిగుతూ రైలు ఢీకొని చనిపోయారు. సెల్ఫీ మోజులో యువత ప్రాణాలు పణంగా పెడుతున్న ఉదాహరణలు అక్కడక్కడ కనపడుతూనే ఉన్నాయి. వీటి గురించి సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా.. మళ్లీ వాటివైపుకే వెళ్లి ప్రాణాలు తీసుకుంటోంది యువత.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..