KGF -2 వెయ్యి కోట్లు దాటింది..

    0
    75

    బాహుబలి త్రిబుల్ ఆర్ తర్వాత అంతటి ఘన విజయాన్ని సాధించిన చిత్రం కే జి ఎఫ్ 2 , రెండు వారాలకు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్ అధిగమించింది . ప్రపంచంలో వెయ్యి కోట్లకు మించిన కేజిఎఫ్ సినిమా భారతీయ సినిమాల్లో నాలుగో స్థానం దక్కింది. త్రిబుల్ ఆర్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో దంగల్ సినిమా ఉంది , మూడో స్థానంలో బాహుబలి నిలిచింది, ఇప్పుడు నాలుగో స్థానానికి కే జి ఎఫ్ టు చేరుకుంది యాష్, రవీనాటాండన్ , సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ దర్శకత్వం వహించారు.

    ఈ సినిమా ఈ సినిమా వ్యాపార విజయాన్ని ,కలెక్షన్లలోనూ రికార్డులను ప్రముఖ ఫిలిం ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాల వివరించారు. కే జి ఎఫ్ 2 వెయ్యి కోట్లు దాటిందని ఆయన తన ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టారు . ఏప్రిల్ 14 వ తేదీన విడుదలైన కే జి ఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్ దాటింది. మొదటిరోజు నికరంగా 134 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది . కన్నడ సినిమా కే జి ఎఫ్ కి సీరీస్ గా కే జి ఎఫ్ టు తీశారు .

    ఒక పేద అనాధ , బంగారు గనులు స్వంతం చేసుకునే కుబేరుడు స్థాయికి ఎలా ఎదుగుతాడు అన్నది ఈ చిత్రం సారాంశం . ఈ చిత్రాన్ని తీసే సమయంలో సంజయ్ దత్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు . ఆయనకి అప్పటికి కేన్సర్ వ్యాధి నిర్ధారణ అయింది . జీవన్మరణ సమస్య లోనూ ఆయన నటించడం మానలేదని మాన్యత వివరించింది.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.