ఈ బైక్ పోతుండగా సీటు కింద మంటలు..

  0
  299

  ఎలక్ట్రిక్ స్కూటర్ యముడి వాహనం లాగా తయారైంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ బైక్ లు , బ్యాటరీ చార్జింగ్ లో ఉండగా కాలిపోవడం , బైక్ స్టాండ్ వేసి ఉండగా పేలిపోవడం , ప్రయాణంలో కాసేపు నిలిపి పక్కన పెట్టినప్పుడు మంటలు వచ్చి మాడిపోవడం ఇలా జరగడం మాత్రమే చూశాం . మొన్నటికి మొన్న తిరుపత్తూర్ లో పృథ్వి రాజ్ అనే వ్యక్తి కొత్తగా కొన్న తన ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచుగా ట్రబుల్స్ ఇవ్వడంతో విసిగిపోయి రెండు లీటర్ల పెట్రోల్ తెప్పించి రోడ్డు పక్కన పెట్టి తగలబెట్టేశాడు .

  పీడా విరగడైందని స్నేహితులకు చెప్పాడు. ఇప్పుడు మరో విచిత్రం జరిగింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ లో సతీష్ అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ బైక్ పై పోతుండగా సీటు కింద నుంచి మంటలు వచ్చాయి. ఒక్క క్షణం అప్రమత్తమై బైక్ నుంచి దిగేసాడు . ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ బైక్ జర్నీ లో ఉండగా సీటు కిందనుంచి మంటలు రావడం ఇదే మొదటిసారి .

  దీంతో అతడికి పక్కనున్న వారు నీళ్ళు తెచ్చి ఆర్పేందుకు ప్రయత్నం చేశారు . అయితే స్కూటర్ మాత్రం కాలిపోయింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎలక్ట్రిక్ బైక్ ల పేలుడు సంఘటనలో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు . వీటన్నిటిని చూస్తుంటే అసలు ఎలక్ట్రిక్ బైక్ సురక్షితమేనా అన్న అనుమానం కూడా కలగడం సహజం..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.