కీవే స్కూటర్ వచ్చేసింది..రేటు 3 లక్షలకుపైనే.

  0
  874

  ఈ స్కూటర్ ఎక్కితే..
  ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. !
  =====================
  స్టేటస్ సింబల్.. రిచ్ నెస్.. అంటే ఇన్ని రోజులూ మంచి కార్లు ఉండాలని అనుకునే వాళ్ళు.. అయితే ఇప్పుడు ఆ అర్ధాన్ని మరోలా మార్చేసింది కీవే కంపెనీ.. ఎందుకంటే కీవే కంపెనీ కొత్తగా విడుదల చేసిన స్కూటర్ ను చూస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే..

  స్కూటర్ అంటే ఇలాగే ఉండాలి అని అనుకునే రోజులు ఇక పోయినట్టే.. రిట్రో మోడరన్ లగ్జరీ సిక్స్ టీస్ 300i స్కూటర్ చూస్తే ఎవరూ కళ్ళుతిప్పుకోలేరు.. ఈ స్కూటర్ అంత సెక్సీగా కనిపిస్తోంది. రిట్రో స్టైల్ లుక్స్.. చూపు తిప్పుకోలేని డిజైన్.. 278 సీసీ లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. LED హెడ్ లైట్, కాళ్ళు పెట్టుకునే ప్లేస్ లో 10 లీటర్ల కెపాసిటీతో ఆయిల్ ట్యాంక్.. డిస్క్ బ్రేక్స్, ఫోన్, వాలెట్ పెట్టుకొనేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన డిజైన్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB సదుపాయం, స్ప్లిట్ సీట్ డిజైన్, డిజిటల్ స్పీడ్ మీటర్, ఆకట్టుకునేలా కార్డిలాక్ టైల్ లైట్స్, ఇలా ఒకటేమిటి.. అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి..

  చివరగా ధర విషయానికొస్తే మూడులక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది. భారత్ లో పెరుగుతున్న లగ్జరీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంది కీవే కంపెనీ.. ఈ స్కూటర్ భారత్ మార్కెట్ లో ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.