ముగ్గురు పోలీస్ ప్రియుళ్లు ,భర్తకు హింసలు.

  0
  858

  క‌ట్టుకున్నోడిపై కేసులు పెట్టి.. ముగ్గురు కానిస్టేబుళ్ళ‌తో కులుకుతోంది ఓ ఇల్లాలు. భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని ఏకంగా చంపించే కుట్ర కూడా చేసిందా మ‌హా ఇల్లాలు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌న్న సంగ‌తి ముందుగానే ప‌సిగ‌ట్టిన ఆ భ‌ర్త‌… భార్య చేసే కుట్ర‌లు కుతంత్రాల‌న్నీ ఆధారాల‌తో స‌హా ఎస్పీకి అందించ‌డంతో.. సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. రాజ‌స్థాన్‌లోని బ‌లోత్రాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

  జ‌గ‌త్ పాల్ అనే లెక్చ‌ర‌ర్ పై అత‌ని భార్య వ‌ర‌క‌ట్నం, గృహ హింస కేసులు పెట్టింది. నాలుగేళ్ళు స‌జావుగా సాగిన కాపురంలో భార్య తీరుతో క‌ల‌క‌లం రేగింది. ఓ పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేస్తోన్న ముగ్గురు కానిస్టేబుళ్ళ‌తో ఆమె అక్ర‌మ సంబంధం నెరుపుతోంది. దీంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూ వ‌చ్చాయి. భార్య తీరు మార‌క‌పోవ‌డంతో.. జ‌గ‌త్ పాల్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే భ‌ర్త‌పై ప‌గ తీర్చుకోవాల‌ని వ‌ర‌క‌ట్నం, గృహ హింస కేసులు పెట్టించిందా ఇల్లాలు.

  ఇదిలావుంటే.. ఓ రెస్టారెంట్ లో కానిస్టేబుల్ సందీప్ చౌద‌రితో త‌న భార్య క‌నిపించ‌డంతో ఫోటోలు వీడియోలు తీశాడు జ‌గ‌త్ పాల్. ఆ త‌ర్వాత స‌ద‌రు కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కుని, వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చాటింగ్, కాన్వ‌ర్ జేష‌న్ మొత్తం తీసుకున్నాడు. అందులో త‌న‌ను చంపే కుట్ర చేశార‌ని గుర్తించి, వెంట‌నే అన్నీ ఆధారాల‌తో స‌హా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఆ ముగ్గురు కానిస్టేబుళ్ళ‌పై యాక్ష‌న్ తీసుకున్నారు. సందీప్ చౌద‌రి ప‌రారీలో ఉండ‌గా, మిగిలిన ఇద్ద‌రు కానిస్టేబుళ్ళు దుర్గారాం, సందీప్ నందుల‌ను స‌స్పెండ్ అయ్యారు. ఇక ఆ భార్య‌పై కూడా భ‌ర్త జ‌గ‌త్ పాల్ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేశారు పోలీసులు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.