మరో పదేళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉండానని కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్, సందేహాలను నివృత్తి చేశారు.
ఇటీవల కొడుకు కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించి తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానన్న ఊహాగానాలకు తెరదించారు. టీఆర్ఎస్ లో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడని, త్వరలో ఆయన పదవి చేపట్టబోతున్నారంటూ బహిరంగసభల్లో చెప్పారు.
https://www.v6velugu.com/cm-kcr-clarifies-about-rumors-on-next-cm-v6-news/
కేటీఆర్ కూడా ఆ వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించలేదు. ఇప్పుడు మొదటిసారిగా కేసీఆర్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, పదేళ్ళు తాను సీఎంగానే ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.