కుంభాల గోత్రస్య.. ఆర్ధ్రా నక్షత్రస్య జాతస్య.. జగన్మోహనరెడ్డి నామధేయస్య..

  0
  646

  కుంభాల గోత్రస్య..
  ఆర్ధ్రా నక్షత్రస్య జాతస్య..
  జగన్మోహనరెడ్డి నామధేయస్య..
  ========================
  ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో ప్రతిపక్షాలు సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ పై ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. హిందు మతానికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. తిరుపతి సహా పలు ఆలయాలను సందర్శించినప్పటికీ.. జగన్‌పై మాత్రం క్రిస్టియన్ ముద్ర పోవడం లేదు. గోత్రం లేని జగన్‌కు మతాల గురించి ఏం తెలుసంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. అయితే విపక్షాల మాటలను జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పదే పదే తను క్రిస్టియన్ అంటూ దాడి చేస్తున్న వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా జగన్ వ్యవహరించారు. తాజాగా నరసరావుపేటలో జరిగిన గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. అర్చక స్వాములు పూజ చేస్తున్న సమయంలో.. తన గోత్ర నామంతో నక్షత్రాన్ని సైతం తెలిపారు. కుంభాల గోత్రస్య, ఆర్ధ్రా నక్షత్రస్య జాతస్య.. జగన్మోహనరెడ్డి నామధేయస్య.. అంటూ పూజారులు గోపూజ సమయంలో జగన్ గోత్రనామం, నక్షత్రాలను ప్రస్తావించారు. దీంతో ప్రతిపక్షాల నోటికి తాళం పడ్డట్టయింది.