పెళ్లి కైపులో కత్రినా కైఫ్..

  0
  662

  బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కౌఫ్ పెళ్ళికి సిద్ద‌మైంది. త‌న‌కంటే ఐదేళ్ళ చిన్న‌వాడైన విక్కీ కౌశ‌ల్ తో ఆమె గ‌త కొంత‌కాలంగా డేటింగ్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా వీరిద్ద‌రూ పెళ్ళి చేసుకోబోతున్నార‌నే వార్త టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. క‌త్రినా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. ఇక విక్కీ కౌశ‌ల్ బాలీవుడ్ లో హీరోగా కొన‌సాగుతున్నాడు. యూరీ, స‌ర్దార్ ఉద్ద‌మ్ చిత్రాల‌తో విక్కీ రేంజ్ పీక్స్ లోకి వెళ్ళింది.

  తాజాగా వీరిద్ద‌రూ ఓ ఇంటివారు కాబోతున్నార‌ని బాలీవుడ్ కోడై కూస్తోంది. విక్కీ కౌశల్, కత్రినా మ్యారేజ్ డిసెంబర్‌లో జరగనున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఏ రోజున జరగనుందో ఇంకా తేదీ ఖ‌రారు కాలేదు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా సాగుతున్న‌ట్లు స‌మాచారం. వీరి పెళ్లికి బాలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌ సహా రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..