వాడొక నీచుడు. కాబోయే భార్యను ఇలా కాటేసాడు..

  0
  23359

  పెళ్లికాకముందే కాబోయే భార్యను నీచంగా బ్లాక్ మెయిల్ చేసి , అమ్మాయి పండంటి జీవితాన్ని నాశనంచేసిన నీచుడు వీడు.. పేరుకు విదేశాల్లో ఉద్యోగం అయినా , వాడి నీచమైన బుద్ది , అమ్మాయి జీవితాన్ని బలితీసుకుంది.. వీడిపేరు కార్తీక్ .. ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ వీడి ఊరు. వీడితో పెండ్యాలకు చెందిన ప్రగతి అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అప్పటి నుంచి , కార్తీక్ , ప్రగతితో ఆస్ట్రేలియా నుంచి వీడియో కాల్ మాట్లాడేవాడు. ఇద్దరూ కాబోయే బార్యాభర్తలేకదా , అని ఇంట్లోవాళ్ళుకూడా పట్టించుకోలేదు.. చిన్నగా ఈ నీచుడు ప్రగతిని తన ఉచ్చులోకి లాక్కున్నాడు..

  ఆమెను నగ్నంగా చూడాలని ఉందంటూ పోరుపెట్టి , వీడియోలో చూపించమనేవాడు.. స్నానం చేస్తుంటే చూడాలని ఉందని చెప్పేవాడు.. నిశ్చితార్ధం అయిందికదా , కాబోయే మొగుడేకదా అని ప్రగతి వీడు చెప్పినట్టే చేసేది. కార్తీక్ , ఈ వీడియోలు రికార్డ్ చేసేవాడు.. ఆస్ట్రేలియానుంచి పెళ్లికోసం వచ్చినతరువాత , కట్నకానుకలు విషయంలో డిమాండ్లు పెంచాడు.. అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో , మీ అమ్మాయి నగ్న వీడియోలు నా దగ్గరున్నాయి ,అడిగినంత కట్నం ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసాడు.. దీంతో వాడి నీచ బుద్దితెలిసిన ప్రగతి ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..