మైకులు ఆన్ లో..చెవిలో గుసగుసల్లో అసలు గుట్టు రట్టయింది.

  0
  167

  త‌మ ముందున్న మీడియా మైక్ లు ఆన్ లో ఉన్నాయ‌ని తెలియ‌క‌… క‌ర్నాట‌కకు చెందిన ఇద్ద‌రు నేత‌లు… త‌మ రాష్ట్ర అధ్య‌క్షుడిని క‌లెక్ష‌న్ ఏజెంట్ గా పేర్కొంటూ సంచ‌ల‌నం సృష్టించారు. విలేక‌రుల స‌మావేశానికి ముందు వారిద్ద‌రూ పిచ్చాపాటీ మాట్లాడుతూ చెవిలో గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో మీడియా మైకులు ఆన్ చేసి ఉన్నాయి. వారు మాట్లాడిన‌దంతా రికార్డ్ అయింది. గ‌వ‌ర్న‌మెంట్ ప‌నుల్లో, ప్రైవేట్ కాంట్రాక్టు ప‌నుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు డీకే.శివ‌కుమార్ క‌లెక్ష‌న్ ఏజెంట్ గా మారిపోయాడని, ఇష్టం వ‌చ్చిన‌ట్లు డ‌బ్బులు దండుకుంటున్నాడ‌ని చెప్పుకున్నారు. ఇంత‌కుముంద 8 శాతం క‌మీష‌న్ తీసుకునేవాడ‌ని, ఇప్పుడు 12 శాతం క‌మీష‌న్ తీసుకుంటున్నాడ‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉండి బాగానే సంపాదించుకుంటున్నాడ‌ని చెప్పుకున్నారు. ఇలా త‌మ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడి గురించి మాట్లాడుకోవ‌డం బ‌య‌ట‌కి పొక్క‌డంతో.. వారిద్ద‌రినీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అస‌లు స‌మావేశం పెట్టింది ఇటీవ‌ల బీజేపీ నాయ‌కులు అనుచ‌రులు, స‌న్నిహితులైన కాంట్రాక్ట‌ర్ల ఇళ్ళ మీద ఐటీ దాడుల గురించి. అయితే వీళ్ళు దానికంటే ముందు, శివ‌కుమార్ అవినీతి బాగోతాన్ని చెప్ప‌డం విచిత్రం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..