అతడు అది చూస్తే చెంప దెబ్బ కొట్టే పనే ఆమెది.

    0
    629

    ఫేస్ బుక్.. ప్రపంచాన్ని మార్చేసిన యాప్ ఇది.. మనం ప్రతిరోజూ ఫేస్ బుక్ చూడాల్సిందే.. నిద్ర లేచింది మొదలు, నిద్రపోయేవరకూ.. మనమందరం ఫేస్ బుక్ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి నిద్రపోకుండా కూడా ఫేస్ బుక్ చూసిన సందర్భాలూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఈ ఫేస్ బుక్ కు అలవాటైతే మానడం కూడా కష్టమే.. ఫేస్ బుక్ వ్యసనాన్ని వదిలిపెట్టడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఈ ఫేస్ బుక్ కారణంగా చాలా సమయాన్ని మనం నష్టపోతూనే ఉంటాం.

    అయితే మనీష్ సేథీ అనే వ్యక్తి కూడా ఫేస్ బుక్ కు బానిసయ్యాడు. ఇతగాడు పావ్లోక్ అనే కంపెనీ సీఈఓ గా ఉన్నాడు. అయితే తరచూ ఫేస్ బుక్ చూడటం కారణంగా ఇతగాడి సంస్థకు నష్టం రావడం ప్రారంభించింది. దీంతో బాగా ఆలోచించిన మనీష్.. ఓ నిర్ణయానికి వచ్చాడు. ఫేస్ బుక్ చూడటం మానేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎంతగా ప్రయత్నించినా ఈ ఫేస్ బుక్ వ్యసనాన్ని మానలేక పోయాడు. దీంతో మనీష్ కు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ ప్రకటన ఇచ్చాడు. తాను ఫేస్ బుక్ చూసినప్పుడల్లా, తనను చెంపదెబ్బ కొట్టేందుకు మనిషి కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. దీంతో ఆ ప్రకటన చూసి, కారా అనే యువతి ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి గంటకు 8 డాలర్ల జీతానికి సెలెక్ట్ అయిపోయింది.

    మనీష్ ఫేస్ బుక్ చూస్తున్నప్పుడల్లా కారా చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభించింది. దీంతో మనీష్ ఫేస్ బుక్ వ్యసనానికి దూరమయ్యాడు. కారా పక్కన లేకపోతే తన సంస్థ ప్రొడక్షన్ 35 శాతం పడిపోతోందని.. కారా పక్కన ఉంటే 98 శాతం అవుట్ ఫుట్ వస్తోందని మనీష్ చెబుతున్నాడు. గత తొమ్మిదేళ్లుగా ఇలా జరుగుతోందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ ప్రముఖ వ్యాపార వేత్త ఎలెన్ మాస్క్ కూడా మనీష్ ను ఇప్పుడు అభినందించారు. చెంపదెబ్బల ప్రయోగం బాగా పనిచేస్తోందంటూ కితాబిచ్చారు.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..