పాకిస్తానీ సైనికుడికి పద్మశ్రీ ఎందుకిచ్చారు.?

  0
  306

  భార‌త‌దేశ ప్ర‌భుత్వం ఇటీవ‌లే వివిధ రంగాల్లో విశేష సేవ‌లందించిన వారికి ప‌ద్మ పుర‌స్కారాల‌ను అందించింది. ఈ ప‌ద్మ పుర‌స్కారాల్లో ఓ పాక్ సైనికుడికి మ‌న ప్ర‌భుత్వం ప‌ద్మ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేయ‌డం విశేషం. కీలక సందర్భాల్లో విదేశీయులకు కూడా భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా ఆ జాబితాలో పాక్ సైనికుడైన ఖాజీ స‌జ్జాద్ ఆలీ జ‌హీర్ చేరారు. అస‌లు ఖాజీ స‌జ్జాద్ ఆలీ జ‌హీర్ ఎవ‌రు ? ఆయ‌న చేసిన సేవ‌లు ఏంటి ? ప‌ద్మశ్రీ పుర‌స్కారాన్ని అందుకునేంత ఘ‌న‌త ఆయ‌న ఏం సాధించాడు ? అన్న‌ది చాలామందికి తెలియ‌దు. ఆ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చూద్దాం.

  భార‌త్ దాయాది దేశం పాకిస్తాన్ నుంచి భార‌త్ కు వ‌చ్చి, బంగ్లాదేశ్ కు విముక్తి క‌ల్పించ‌డంలో ఖాజీ స‌జ్జాద్ ఆలీ జ‌హీర్ కీల‌క‌పాత్ర పోషించారు. 1971 నాటికి పాక్, బంగ్లా క‌లిసి ఉండేవి. అయితే బంగ్లాపై పాక్ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ, చిత్ర‌హింస‌ల‌కు గురిచేసింది. పాక్ తో తెగ‌దెంపులు చేసుకుని వేరుగా ఉండాల‌ని బంగ్లాదేశం భావించింది. అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న యుద్ధ స‌మ‌యంలో వేల‌మంది బంగ్గేయులు పాక్ అచార‌కాల‌కు ప్రాణాలు కోల్పోయారు. ఆ స‌మ‌యంలో జ‌హీర్‌, పాక్ సైనికుడిగా ప‌ని చేస్తున్నారు. బంగ్లాపై పాక్ ఆగ‌డాల‌ను జీర్ణించుకోలేక క‌ట్టుబ‌ట్ట‌ల‌తో, కుటుంబాన్ని వ‌దిలి భార‌త్ కు వ‌ల‌స వ‌చ్చేశారు. పాక్‌-బంగ్లా యుద్దంలో బంగ్లాకు మ‌ద్ద‌తుగా భార‌త్ నిలిచింది. అప్ప‌టికే జ‌హీర్ కు పాక్ ర‌హ‌స్యాలు, గుట్టు, ప‌ట్టు తెలిసి ఉండ‌డంతో బంగ్లాతో క‌లిసి భార‌త్ యుద్దంలో పాల్గొని విజ‌యం సాధించింది. ఈ యుద్దంలో జ‌హీర్ కీల‌క‌పాత్ర పోషించారు. దీంతో బంగ్లాదేశ్ స్వ‌తంత్ర దేశంగా ప్ర‌పంచ ప‌టంలో నిలిచింది. 1971 మార్చి 26న బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ త‌ర్వాత జ‌హీర్ బంగ్లాదేశ్ మిల‌ట‌రీలో ప‌ని చేశారు. లెఫ్ట్ క‌ల్న‌ల్ గా ఎదిగారు. 20 ఏళ్ళ క్రితం ఆయ‌న రిటైర్ అయ్యారు.

  ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే, ఖాజీ స‌జ్జాద్ ఆలీ జ‌హీర్ పై పాక్ ప్ర‌భుత్వం డెత్ వారెంట్ విధించింది. ఎప్పుడైనా పాక్ నుంచి వ‌ల‌స‌పోయాడో, అప్ప‌టి నుంచి ఈ వారెంట్ ఆయ‌న‌పై కొన‌సాగుతోంది. ఆయ‌నను ప‌ట్టించినా, చంపినా భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది పాక్ ప్ర‌భుత్వం. అయితే రిటైర్ అయ్యే వ‌ర‌కు జ‌హీర్ బంగ్లాదేశ్ లో ఉన్న సంగ‌తి పాక్ కు తెలిసిన విష‌య‌మే. అయితే రిటైర్ అయిన త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డ ఉన్నాడ‌నేది మాత్రం తెలియ‌దు. పాక్ కే కాదు, ఎవ‌రికీ ఈ విష‌యం గురించి తెలియ‌దు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌ద్మ పుర‌స్కార వేడుక‌లో ఆయ‌న ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న‌ప్పుడు, జ‌హీర్ ఎక్క‌డున్నాడ‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

  పాక్ దేశానికి కూడా తెలిసింది. రిటైర్ అయిన నాటి నుంచి జ‌హీర్‌, భార‌తదేశంలోనే త‌ల‌దాచుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన భ‌ద్ర‌త క‌ల్పిస్తోంది. అన్నీ వ‌దిలి, అంద‌రినీ వ‌దిలి, కుటుంబాన్ని వ‌ద‌లి, బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన గొప్ప వ్య‌క్తిగా ఖాజీ స‌జ్జాద్ ఆలీ జ‌హీర్ చ‌రిత్ర లిఖించారు. పాక్ దేశీయుడైనా, స్వ‌దేశం కోసం, బంగ్లా స్వాతంత్య్రం కోసం ఆయ‌న చేసిన అవిర‌ళ‌కృషికి మ‌న భార‌త ప్ర‌భుత్వం జ‌హీర్ ను ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో గౌర‌వించి స‌త్క‌రించింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..