పోలీస్ సింగం రాజేశ్వరికి స్టాలిన్ ప్రశంస..

  0
  3295

  చెన్నై భారీ వర్షాల్లో చెట్టు పడి , చనిపోయాడనుకున్న యువకుడిని కాపాడిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరిని ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు. .. చెన్నైలో భారీ వర్షాలకు ఓ ప్రాంతంలో పెద్దచెట్టు కూలిపోయింది.. ఆ సమయంలో చెట్టుకిందే డాబాలో మందు కొడుతున్న ఇద్దరు స్నేహితుల్లో ఉదయకుమార్ అనే ఇతను చనిపోయాడని , స్నేహితుడు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాడు..

  దీంతో రాజేశ్వరి రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుంది. ఆమె అతడి నాడి పట్టి చూసింది. ఉదయకుమార్ , కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు.. దీంతో లేడి బాహుబలిలాగా , కొంతమంది సాయంతో చెట్టు తొలగించింది.. అతడిని ఎత్తేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో , తానే భుజాన వేసుకొని , హాస్పిటల్ కి తీసుకెళ్లింది.. అక్కడ వైద్యులు కూడా , సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.. రాజేశ్వరిని సీఎం పిలిపించి , ప్రత్యేకంగా అభినందించి , ప్రశంసాపత్రం అందించారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..