విజయ్ సేతుపతిని తంతే రూ.1001 బహుమతి..

  0
  710

  త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిపై ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ గొడ‌వ త‌ర్వాత హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించి కలకలం రేపింది. స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను విజయ్ సేతుపతి అవమానించాడంటూ ఓ వీడియోను సదరు సంస్థ పోస్ట్ చేసింది. “తేవర్ అయ్యను అవమానించినందుకుగాను ఎవరైతే నటుడు విజయ్ సేతుపతిని తంతారో, వారికి బ‌హుమ‌తి ఉంటుంద‌ని పేర్కొంది. ఒకసారి తంతే వారికి రూ. 1001 ఇస్తామని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు.అత‌ను క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు త‌న్నాల‌ని కూడా వారు పేర్కొన్నారు.

  విజయ్‌ సేతుపతిని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తితో తాను మాట్లాడానని అన్నారు అర్జున్ సంపత్. విజయ్‌ సేతుపతి అతనితో చాలా హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారి తీసిందన్నారు. విజయ్‌ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు అతను విషెస్‌ చెప్పాలనుకున్నాడని, కానీ విజయ్‌ వ్యంగ్యంగా స్పందించాడని చెప్పారు. ఈ వివాదంపై విజ‌య్ సేతుప‌తి ఎలా స్పందిస్తాడో చూడాలి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..