వామ్మో.. ఎంత డబ్బో.. కళ్లుతిరిగి కిందపడ్డ ఐటీ అధికారులు

  0
  5134

  ఐటీ అధికారుల దాడుల్లో డబ్బులు, నగలు బయటపడటం సహజమే. అయితే కొన్నిసార్లు వారు షాకయ్యే స్థాయిలో డబ్బు బయటపడుతంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా కట్టలు కట్టలుగా డబ్బుల గుట్టలు బయటపడటంతో ఐటీ అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

  కాన్పూర్‌ కు చెందిన అత్తరు తయారీ సంస్థ చాన్నాళ్లుగా పన్ను ఎగ్గొడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. దాదాపు 24గంటల సేపు ఈ ప్రాసెస్ జరిగింది. మొత్తం రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్క కొనసాగుతూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పీయూష్‌ జైన్‌ సమాజ్‌వాదీ పార్టీ నేత కూడా కావడంతో అక్కడ బీజేపీ.. సమాజ్ వాదీ పార్టీపై ఆరోపణలు ఎక్కు పెట్టింది.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..