37 కోట్ల ఇన్సూరెన్స్ కోసం వేరొకడిని చంపి..

  0
  4846

  వీడో పెద్ద క్రిమినల్.. తనపై చేసుకున్న 37 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం , వేరొకడిని పాముకాటుతో చంపించి , చచ్చింది తానేనని , మృతుడిని హాస్పిటల్ కి తీసుకుపోయి , పోస్ట్ మార్టం చేయించి , డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే , మృతుడి మేనల్లుడుగా తానే నామినీనని చెప్పి ,డబ్బు తీసుకునే ప్రయత్నంలో చిక్కిపోయాడు. మహారాష్ట్ర అహమద్ నగర్ కి చెందిన , ప్రభాకర్ వాగ్ చౌరే ఎన్నారై .. అమెరికాలో 20 ఏళ్ళు ఉన్నాడు.. అక్కడే 37 కోట్లకు ఇన్సూరెన్స్ చేసాడు. ఇటీవలే ఇండియాకు వచ్చి , స్వగ్రామంలో ఉన్నాడు. ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేసేందుకు ప్లాన్ చేసాడు.

  అనూప్ అనే మతిస్తిమితంలేని వ్యక్తిని , కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అతడి కాలిపై , పాముతో కరిపించి చంపేశాడు.. తర్వాత అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్లి , తనపేరుతోనే అతడిని హాస్పిటల్లో చేర్పించాడు. దగ్గరుండి అన్నీ తానేచేసి , చివరకు ఇన్సూరెన్స్ అధికారులకూ , తన డెత్ సర్టిఫికెట్ తానే ఇచ్చి , తనను తాను మేనల్లుడుగా , నామినీగా పరిచయంచేసుకున్నాడు. ఇన్సూరెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే , గతంలో కూడా , ప్రభాకర్ వాగ్ చౌరే తన భార్య ఇన్సూరెన్స్ విషయంలో ఇన్సూరెన్స్ అధికారులను మోసం చేసాడు. అధికారులు చేసిన విచారణలో , ప్రభాకర్ వాగ్ చౌరే మోసం బయటపడింది.. దీంతో పోలీసులు రంగప్రవేశంచేసి వాడిని అరెస్ట్ చేశారు. హత్య , చీటింగ్ కేసులు కట్టి జైలుకు పంపారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..