ఆహా ఓటీటీలో.. ఇద్దరి షో అదిరేనా.. ??

  0
  268

  బాలకృష్ణ మొదటిసారి ప్రత్యేకంగా ఆహా ఓటీటీలో ఒక టాక్ షోకు హోస్టింగ్ చేసేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో ద్వారా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలయ్య.. బాలకృష్ణ హోస్ట్‌గా పరిచయం కానున్నారు అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండి కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దాదాపు అందరు ప్రేక్షకులు ఆయన హోస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామనే ఎదురు చూస్తున్నారు.

  ఈ షో నవంబర్ 4 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ‌చ్చే తొలి గెస్ట్ ఎవ‌రన్న సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. మొదట అందరూ అల్లు అర్జున్ ఫస్ట్ గెస్ట్ గా వస్తారని భావించారు. దీనిపై ఫ్యాన్ మేడ్ వీడియోలు కూడా చేశారు.

  అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ షోకి మొదటి అతిధిగా రానున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు మొదటిసారిగా ఇటువంటి టాక్ షోకి వస్తుండటంతో.. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.

  ఆహా అన్ స్టాపబుల్ సెట్ లో బాలయ్యతో కలిసి మోహన్ బాబు ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో మోహ‌న్ బాబుతో బాల‌కృష్ణ సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..