కెనడాలో జరిగిన ఓ దారుణ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు చనిపోయారు. కెనడాలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు రాయబార కార్యాలయం ప్రకటించింది. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటారియో హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ఓ ప్యాసింజర్ వ్యాన్ లో ప్రయాణిస్తుండగా.. తెల్లవారు ఝామున మూడున్నర గంటల సమయంలో ట్రాక్టర్ ట్రైలర్ ను ఆ వ్యాన్ ఢీకొంది. దీంతో ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని హర్ ప్రీత్ సింగ్, జస్వీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్, పవన్ కుమార్ గా గుర్తించారు.