ఓటు ,నోట్లు వేసి నన్ను ఎమ్మెల్యే చెయ్యండి..

  0
  55

  ఎన్నికల్లో నిలబడ్డాను , బాబూ ధర్మంచేయండి.. అవతల పార్టీ వాళ్ళు ఇచ్చేడబ్బుల్లో నాకు కొంత ఇచ్చి , ఓటేసి గెలిపించండి అంటూ రామ్ దాస్ మానవ్ అనే అభ్యర్థి యుపి ఎన్నికల్లో ప్రాధేయపడుతున్నాడు. రామ్ దాస్ మానవ్ ఫిరోజాబాద్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాడు. ఆయన గాజులు తయారుచేసే పరిశ్రమల్లో కార్మికులకు నాయకుడు. ఫిరోజాబాద్ నియోజకవర్గంలో గాజులు తయారీ ఎక్కువగా జరుగుతుంది.

  ఈ పనిచేసే కార్మికులు దుర్బర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. వాళ్లకు , వాళ్ళ బాధలకు విముక్తి కలిగించాలనే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని చెప్పాడు. విచిత్రంగా ఆయన ఎన్నికల గుర్తుకూడా గాజు.. తన కాళ్ళకు , చేతులకు గొలుసులు కట్టుకొని ప్రచారం చేస్తున్నాడు.. గాజు పరిశ్రమల కార్మికులు ఇలా కష్టాల బంధనాల్లో ఉన్నారని , ఇందుకు సంకేతంగానే తాను , కాళ్లకు చేతులకు గొలుసులు వేసుకున్నానని చెప్పాడు. చేతిలో ఒక పాత్రతో ఆయన ఓట్లుతోపాటు , నోట్లుకూడా ఆడుకుంటున్నాడు..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..