క్యాంపస్ సెలెక్షన్లలో కోటి ప్యాకేజీలు..

    0
    1058

    దేశంలోని వివిధ ఐఐటీల్లో జ‌రిగిన క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్ లో 160 మంది విద్యార్ధులు బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. ఏడాదికి కోటి రూపాయ‌ల జీతం చొప్పున వివిధ కంపెనీల్లో ప్యాకేజీ ప‌ట్టేశారు. మొద‌టి విడ‌త‌గా ఈ ఏడాది చివ‌రి నాటికి ఐఐటీల్లో 9 వేల ఉద్యోగాలు వ‌చ్చాయి. వాటిలో 160 మందికి ఏడాదికి కోటి రూపాయ‌ల ప్యాకేజీ వ‌చ్చింది. ఐఐటీ స్టూడెంట్స్ లో కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు 15 నుంచి 35 శాతానికి పెరిగాయి. నైపుణ్యం క‌లిగిన అభ్య‌ర్ధుల‌ను తీసుకునే పోటీల్లో కంపెనీలు ఇప్ప‌టికీ ఐఐటీల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నాయి.

    వీటిలో ఐఐటీ మ‌ద్రాస్ నుంచి ఈ ఏడాది 27 మంది కోటి రూపాయ‌ల‌కు పైగా ప్యాకేజీ కొట్టేశారు. వీటిలో స్వ‌దేశీ కంపెనీల‌తో పాటు విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మ‌ద్రాస్ ఐఐటీ నుంచి 1327 మంది మంచి ఆఫ‌ర్లే తీసుకున్నారు. ఐఐటీ కాన్పూర్ నుంచి 1330 మంది, ఐఐటీ రూర్కెలా నుంచి 1243 మంది, ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ నుంచి 1600 మంది, ఐఐటీ ఢిల్లీ నుంచి 1250, ఐఐటీ బాంబే నుంచి 1382 మంది అవ‌కాశాలు చేజిక్కించుకున్నారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..