ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సీబీఐ దాడి చేసి పట్టుకుంది. పంజాబ్ రహదారుల విభాగంలో డైరెక్టర్ గా ఉన్న పరంజీత్ సింగ్ ఒక అధికారి ప్రమోషన్ కోసం ఈ 2 లక్షల రూపాయలు లంచం అడిగాడు. కొంతకాలం పాటు లంచం ఇవ్వలేదని, ప్రమోషన్ ఫైల్ తొక్కిపెట్టాడు. కుంటి సాకులు చెప్పి దాటవేస్తూ వచ్చాడు. చివరకు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ప్రమోషన్ ఇస్తానని బేరం పెట్టాడు.
ఆ అధికారి సీబీఐకి విషయం మొత్తం వివరించి తనకి సహకరించాలని కోరాడు. దీంతో సీబీఐ అధికారులు వలపన్ని 2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టేశారు. బాధితుడు కూడా ఐఏఎస్ హోదాలో ఉన్నవాడే కావడం విశేషం. సీబీఐ ఆ తర్వాత పరంజీత్ సింగ్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేస్తే 30 లక్షల రూపాయలు చిక్కాయి. మొదట 5 లక్షల రూపాయలు లంచం అడిగాడని, ఆ తర్వాత 2 లక్షలకు తగ్గి వచ్చాడని సీబీఐ అధికారి జోషి చెప్పారు. లంచగొండి ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.