టిడిపి నారీ సంకల్పదీక్షలో డాన్సులపై దుమారం..

  0
  228

  నారీ సంకల్ప దీక్ష నవ్వులపాలు..టీడీపీ చేపట్టిన నారీ సంకల్ప దీక్ష నవ్వులపాలవుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగు మహిళలంతా ఒకరోజు దీక్ష చేపట్టారు. జిల్లాలనుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెలుగు మహిళలు తరలి వచ్చారు. అయితే దీక్ష తర్వాత వారు పాటలకు నృత్యం చేయడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది. దీక్షతోపాటు డ్యాన్స్ లు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

  అటు వైసీపీ కూడా టీడీపీ నారీ దీక్షపై తీవ్రంగా స్పందిస్తోంది. నారీ సంకల్ప దీక్షలో టీడీపీ మహిళా నేతలు చేసిన డ్యాన్స్ లకు ఊ అంటావా, ఊఊ అంటావా అనే పాటల్ని రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. నారీ దీక్షల పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు వైసీపీ నేతలు.వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే కారణంతో నారీ దీక్ష చేపట్టినట్టు తెలిపారు.

  టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీ మహిళలు, బాలికలకు అండగా ఉంటుందని ఆమె చెప్పారు. మహిళల్లో ధైర్యం నింపడానికే సంకల్ప దీక్ష చేపట్టినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ఎలాంటి ఆపద వచ్చినా తాము ముందుంటామని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికే నారీ సంకల్ప దీక్షను చేపట్టామని పేర్కొన్నారు. అయితే నారీ సంకల్ప దీక్ష సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోలింగ్ కి గురికావడం విశేషం.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..