అలనాటి అందాల తార కాంచన జీవితం – ఇలా ధన్యమైంది.

  0
  424

  ఒక నాటి అందాలతార కాంచన జీవితంపై అనేక పుకార్లు, అపోహలు.. ఆమెకు తిండికి లేక , దేవాలయాల్లో బిక్షాటన చేస్తోందని , ఇళ్ళులేక దేవాలయాల్లోని నిద్రిస్తోందని చెప్పేవారు. కానీ అవన్నీ అబద్దాలనిచెప్పినా , పుకార్లు మాత్రం ఆగలేదు. ఆమెకు దేవుడిపై అపారమైన విశ్వాసం. నిత్యం దేవాలయాల్లో కనిపిస్తుంది.. నేటితరానికి ఆమె ఎంత అందాలతారో తెలియదు.. అలాంటి కాంచన జీవితం ఇప్పుడు ధన్యం కాబోతుంది.

  చెన్నై నడిబొడ్డు టి నగర్ లో ఆమె ఇచ్చిన 30 కోట్లరూపాయల స్థలంలో ఈ నెల 13 న పద్మావతి అమ్మవారి దేవాలయానికి టిటిడి శంకుస్థాపన చేయబోతొంది. దాదాపు 7 కోట్లరూపాయలతో ఈ దేవాలయం నిర్మిచబోతున్నారు. కాంచన , ప్రకాశంజిల్లా కరవదిలో పుట్టింది.

  https://timesofindia.indiatimes.com/city/hyderabad/Actor-Kanchana-donates-Rs-15-cr-worth-land-to-TTD/articleshow/6811769.cms

  సంపన్నకుటుంబంలో పుట్టిన , తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో చెన్నైకి మకాం మార్చారు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నప్పుడు , విమానంలో ఆమెను చూసిన సినిమా డైరెక్టర్ శ్రీధర్ , ఆమెకు మొదట తమిళంలో ఛాన్స్ ఇచ్చాడు. తరువాత ఆమె తెలుగు , తమిళ్ , కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా అగ్రస్థానంలో నిలిచారు. 81 ఏళ్ళ వయసులో ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు…

  https://ndnnews.in/priyankachoprafacesembarrasement/