స్మార్ట్ ఫోన్ కొన్న పెళ్ళాం.. భర్త ఏం చేశాడో తెలుసా..?

  0
  92

  స్మార్ట్ ఫోన్ కొనుకున్న పెళ్ళాం..

  భర్త ఏం చేశాడో తెలుసా..?

  శ్రీమతి అడిగితే బహుమతులను కొనిచ్చే భర్తలను మనం చూస్తూనే ఉంటాం.. అయితే కొందరు భర్తలు మాత్రం, భార్యలు అడిగినవన్నీ కొనలేకపోయినా.. కొంత మేర అడ్జస్ట్ చేస్తూ కాపురాన్ని లాగించేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మాత్రం మూడవ రకం.

  కలకత్తాలోని నరేంద్రపూర్ లో రాజేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఇటీవల గతకొంత కాలంగా ఆయన భార్య, స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ భర్తను కోరుతూ ఉంది. ఇందుకు రాజేష్ ససేమిరా అంటూ కాలాన్ని గడిపేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ కారణంగా సంసారంలో కలతలు ఏర్పడతాయని వద్దని చెప్పేవాడు.

  అయితే భర్త ఎంతలా చెబుతున్నా పట్టించుకోకుండా.. అతడికి తెలియకుండా భార్య స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి వాడటం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ రగిలిపోయాడు. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

  అనుకున్నదే తడవుగా.. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి.. అదే రోజు రాత్రికి భార్యను చంపేందుకు కిల్లర్స్ కు సుపారీ ఇచ్చి రప్పించాడు. అయితే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు. కిల్లర్స్ తో పాటుగా రాజేష్ ను పోలీసులకు పట్టించారు. రాజేష్ భార్య మాత్రం గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..