భార్య ఆధార్ కార్డుతో ప్రియురాలితో హోటల్లో..

  0
  719

  కోటీశ్వరులు అయినా భర్త దుర్భుద్దిని ఆ భార్య కొత్త టెక్నాలజీతో పట్టేసింది. భార్య ఆధార్ కార్డ్ తీసుకుని ప్రియురాలినే భార్యగా డూప్ చేసి, హోటల్ లో రూమ్ బుక్ చేసిన భర్త బండారాన్ని బయటపెట్టింది. మహారాష్ట్రలోని పుణెలో 41ఏళ్ల వ్యాపారవేత్త తన ప్రియురాలితో కలసి భార్య ఆధార్ కార్డ్ ఆధారంగా, తన భార్య అని చెప్పి హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ముందుగానే భర్త కారులో ఒక జీపీఎస్ పరికరం అమర్చింది.

  ఆ జీపీఎస్ పరికరాన్ని తన సెల్ ఫోన్ కి కనెక్ట్ చేసుకుంది. అక్కడినుంచి కారులో భర్త ఎక్కడెక్కడికి పోతున్నాడో ట్రాకింగ్ చేస్తోంది. భర్త కారు ఓ హోటల్ దగ్గర ఉందని నిర్థారించుకుని అక్కడికి వెళ్లింది. బెంగళూరుకి వెళ్తున్నానని చెప్పిన భర్త, పుణెలోనే ఓ హోటల్ లో ఉన్నాడని జీపీఎస్ ద్వారా తెలుసుకుంది. దీంతో వెంటనే హోటల్ కి ఫోన్ చేసింది.

  తన భర్త పేరు చెప్పి అలాంటి వ్యక్తి ఎవరైనా హోటల్ లో దిగి ఉన్నారా అని అడిగింది. ఆ వ్యక్తి తన భార్యతో సహా హోటల్ లో దిగాడాని రిసెప్షన్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో భర్త తన ప్రియురాలితో కలసి హోటల్ లో దిగాడని నిర్థారణ చేసుకుంది. తన ఆధార్ కార్డ్ నే ప్రియురాలికోసం వాడాడని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ హోటల్ పై దాడి చేయించింది. భర్త, ప్రియురాలు ఈ విషయం కాస్త ముందుగా తెలుసుకుని హోటల్ నుంచి పరారయ్యారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..