నా భార్యకు మొగుడు కావలెను..

  0
  426

  తమిళనాడులో ఓ వ్యక్తి భార్య విడాకులకు నిరాకరించిందన్న కారణంతో నీఛమైన పనికి పూనుకున్నాడు. తిరువళ్లూరు జిల్లాలో ఓం కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. భార్యతో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు ఇవ్వాలని కోరాడు. గతేడాదికాలంగా వీరిద్దరి మధ్య విభేదాలున్నాయి. ఈ గొడవల మధ్యనే ఇద్దరూ విదేశాలకు వెళ్లారు. పెళ్లయిన ఏడాదిలోపు తగాదాలు మంచివి కాదని బంధువులు చెప్పినా వినలేదు. విదేశాలకు వెళ్లిన కుమార్, అక్కడ ఉద్యోగం మానేసి మళ్లీ ఇండియాకి వచ్చేశాడు.

  భార్య మాత్రం అక్కడే ఉండిపోయింది.సెప్టెంబర్ 17వ తేదీ కుమార్ భార్యకు, ఆమె తండ్రికి వందలకొద్దీ ఫోన్లు వచ్చాయి. మ్యాట్రిమోనియల్ సైట్ లో కుమార్ తన భార్య వివరాలు, ఫోన్ నెంబర్, ఆమె తండ్రి ఫోన్ నెంబర్ కూడా పెట్టేశాడు. ఆమెకింకా పెళ్లి కాలేదని, ఇష్టం ఉన్నవారెవరైనా సంప్రదించ వచ్చునని ఆమె ఫొటోతో సహా వెబ్ సైట్ లో పెట్టడంతో వందలకొద్దీ కాల్స్ వచ్చాయి. దీంతో ఆమె తండ్రి పద్మనాభన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుమార్ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..