కేరళలో సంచలనం కలిగించిన ఉత్తర అనే యువతి హత్య కేసులో భర్త సూరజ్ కి 17 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కొల్లం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఉత్తరను , భర్త పాముచేత కాటు వేయించి చంపేశాడు. ఇలా ఒక సారి ప్రయత్నంచేసి విఫలమయ్యాడు. మళ్ళీ రెండో దఫా పాము చేత కాటు వేయించి భార్యను చంపడంలో సక్సెస్ అయ్యాడు. మొదటిసారి ఆమెను పాము కాటుకు గురిచేశాడు. నిద్రపోతుండగా , ఆమె మంచంపైకి పాముని వదిలాడు. అప్పుడు పాము కాటునుంచి ఉత్తర బయటపడింది. రెండు వారాలు ఆసుపత్రిలో ఉండి , బతికి బయటపడింది.
మళ్ళీ కొంతకాలం తరువాత , ఆమె పడుకొనిఉండగా , బెడ్ పైకి నాగుపాముని వదిలిపెట్టాడు. ఈ దఫా కాటుకి ఆమె చనిపోయింది. పాముకాటు అనుకొని అందరూ భావించారు. సూరజ్ పై అనుమానం కలగలేదు. తరువాత సూరజ్ , ఆమె పేరుతొ ఉన్న లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కి అప్ప్లై చేసాడు.
సూరజ్ తమ్ముడికి అనుమానమొచ్చి , పోలీసు ఫిర్యాదు ఇచ్చాడు. కోర్టుని కూడా ఆశ్రయించాడు. సూరజ్ ఫోన్ కాల్స్ లో , పాములు పట్టేవాళ్లతో మాట్లాడిన నంబర్లు గుర్తించారు. దీంతో పోలీసులు , శాస్త్రీయంగానే ఈ కేసును ఛేదించారు. వాడికి శిక్ష వేయించారు..