కారులో ఒక్కడే ఉంటే మాస్క్ ఎందుకు.? హైకోర్టు.

  0
  219

  కారులో ఒక్కరే పోతుంటే మాస్క్ వేసుకోవాల్సిందేనా..? ఈ విషయమై ఢిల్లీ హై కోర్టులో జరిగిన ఒక కేసుకు సంబంధించిన విషయమై, న్యాయ మూర్తులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కారులో ఒక్కరే పోతుంటే మాస్క్ వేసుకోమని చెప్పడం తెలివితక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి ఆదేశాలు ఎవరిస్తారని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇంట్లో బెడ్ రూమ్ లో ఉన్నా కూడా మాస్క్ వేసుకోమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఒక న్యాయవాది తన తల్లితో కలిసి బయటకు వెళ్లి.. ఆమెను వేరొక చోట వదిలేసి.. ఒంటరిగా కారులో వస్తుండగా పోలీసులు ఆపి.. మాస్క్ లేదంటూ ఫైన్ వేశారు. ఈ విషయమై ఆ న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సింగిల్ బెంచ్ జడ్జీ.. కారులో ఒక్కరే ఉన్నా, మాస్క్ లేకపోతే ఫైన్ వేయొచ్చని.. ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. అందువలన కేసును కొట్టివేస్తున్నానని కూడా చెప్పారు. అయితే సింగిల్ జడ్జీ తీర్పుపై, ఆ న్యాయవాది డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు.

  కేసును విచారించిన న్యాయమూర్తులు, సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. కారులో ఒక్కరే వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదని, కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. మాస్క్ వేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఎలా ఉత్తర్వులు ఇస్తుందంటూ డివిజన్ బెంచ్ నిలదీసింది. ఇలాంటి తలతిక్క నిర్ణయాలు ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించారు. తక్షణమే ఈ నిర్ణయాలను ఉపసంహరించాలని ఆదేశాలిచ్చారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..