జగనన్న ఇళ్ల పధకానికి హైకోర్టు బ్రేక్..

    0
    404

    రాష్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ళు , స్థలాల పధకానికి బ్రేక్ పడింది. ఇందుకు సంబందించిన ప్రభుత్వ నిబంధనలు ,ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఒక సెంట్ భూమి ఇవ్వాలన్న ప్రతిపాదన మంచిదికాదని , పర్యావరణ , కుటుంబ ఆరోగ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అందువల్ల ఈ నిబంధనలు పాటిస్తూ , మళ్ళీ వాటిపై పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలని , ఇలా స్థలాల విస్తీర్ణం పెంచాలని స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాలను , రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా , డి ఫారం పట్టాలుగానే ఇవ్వాలని చెప్పింది. మహిళల పేరుతొ ఇళ్లపట్టాలు ఇస్తామన్న ఆదేశాలనుకూడా తప్పుపట్టింది. అర్హులైన పురుషులు , ట్రాన్స్ జెండర్లకు కూడా ఇవ్వాలని చెప్పింది. సెంటుకు మించి స్థలం ఇచేందుకు స్థల సేకరణ జరపాలని కూడా పేర్కొంది. అప్పటివరకు జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ , ఇళ్ల నిర్మాణం ఆపివేయాలని చెప్పింది. తెనాలికి చెందిన కొందరు వ్యక్తులు వేసిన పిటీషన్ పై కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..