కమ్మ వర్సెస్ కాపు , మా ఎన్నికల తెరవెనుక కథ.

  0
  311

  సినిమాలోకం విచిత్రమైనది.. తెరమీద మనం చూసేదివేరు, సినిమా జీవుల అసలు జీవితం వేరు.. మా ఎన్నికల రభస చూస్తుంటే ఇది నూటికినూరుపాళ్లు నిజం.. ఒక చిన్న సంఘం కోసం రెండువర్గాల కొట్టుకోకుండా, కొట్టుకున్నంత పనిచేస్తున్నాయి. తిట్టుకోవడం, సవాళ్లు చేసుకోవడం తోలుబొమ్మలాటలో కేతుగాడుని మించిపోయారు. కేతుగాడు అంటే జోకర్ అన్నమాట. అయితే ఇదంతా బయటకు కనిపించే మా సంఘం మాయాబజార్ సినిమా మాత్రమే.. దీని వెనుక అసలు కధవేరే ఉంది.. అదే కులం .. ఎవరు అవున్నన్నా , కాదన్నా మా ఎన్నికల వెనక అసలు కథ నడిచేది కులం చుట్టూనే అన్న విషయం అందరికీ తెలుసు.. రంగంలో ఉన్న ఇద్దరూ తమకు కులాలు లేవని చెబుతున్నా , ఎన్నికల్లో జరిగేది కులరాజకీయమే.. ప్రకాష్ రాజ్ లాంటి అభ్యర్థులకు కులం పిచ్చి లేకపోవచ్చు , విష్ణు కూడా దాని జోలికి పోకపోవచ్చు .. ఇలా మనం అనుకొన్నా , ప్యానెల్ వెనుక ఉన్నపెద్దలు చేసేది కులరాజకీయమే..

  సినిమా రంగంలో కులరాజకీయం బహుశా 70 వ దశకం నుంచే వచ్చింది.. అంతకుముందు సినిమా రంగంలో కులం కంపు లేదు.. 1970 తరువాత ఇది సినిమా పరిశ్రమలో మహా వృక్షమైంది. ఒక రకంగా కమ్మ కుల ఆధిపత్యమే సినీ పరిశ్రమను శాసించింది. నిర్మాతలు , హీరోలు , డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు ..ఇలా అన్ని రంగాలలో అది బలపడింది.. చిరంజీవి ఎదుగుదల ,సినీ పరిశ్రమలో కులాధిపత్యానికి గండి కొట్టింది. తన ఉన్నతికి ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ , తన కుటుంబంలో వాళ్ళను పరిశ్రమలోకి తీసుకొస్తూ , ఒక్కడుగానే బలపడిపోయాడు.. 25 ఏళ్లు ఆయన చుట్టూనే పరిశ్రమ , పరిభ్రమించింది.

  ఇక్కడ బలపడింది చిరంజీవి కులంకాదు , ఆయన కుటుంబం.. వాళ్ళమీద ఆధారపడ్డ నిర్మాతలు .. ఇలా మారినపరిస్థితుల్లో మా ఎన్నికలు కూడా ఇప్పుడు మొదటిసారిగా కులం కంపు కొడుతున్నాయి. ఇప్పుడిది కమ్మ కులం మెజారిటీగా విష్ణు వెనుకే ఉంది.. చిరంజీవి కుటుంబం ప్రకాష్ రాజ్ వెనుకవుంది.. సినిమా రంగంలో కాపులు కూడా తక్కువే అయినప్పటికీ , చిరు నిర్ణయమే వారికి ఫైనల్..

  ఇక్కడ కులంకంటే చిరంజీవి కుటుంబమే ముఖ్యమైంది.. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అన్న ప్రచారంకూడా ఎక్కువైంది. అయితే కళకు ,బాషా ,ప్రాంతం , కులం తేడాలేదని మాత్రం ఇప్పటికీ నీతులు చెప్పేవాళ్ళే ఎక్కువ.. ఇప్పటికైతే మా ఎన్నికలు తెరవెనుక జరిగేదంతా కుల రాజకీయమే..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..