పోలీసులూ ..ఒరే ,తురే ,ఏయ్ అంటూ మాట్లాడొద్దు..

  0
  682

  మీ పోలీసులకు ముందు మర్యాదగా మాట్లాడటం నేర్పించండి.. ఒరే , ఒసేయ్ , రారా , పోరా.. వాడు , వీడు అంటూ ప్రజలను ఏకవచనంతో అసభ్యంగా మాట్లాడం మానమని చెప్పండి ..అంటూ కేరళ హైకోర్టు జడ్జి దేవన్ రామచంద్రన్ , కేరళ పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే డిజిపి , తమ పోలీసులను ఈ మేరకు ఆదేశించాలని కూడా కోరారు. అలా జారీ చేసిన ఉత్తర్వులు కోర్టుకు కూడా పంపాలని కోరారు. 15 ఏళ్ళ తన కూతురిని ఒక కానిస్టేబుల్ ఆపి , స్కూటీ పేపర్స్ చూపించమని అడిగాడని , అయితే , అతడు తన కూతురు పట్ల ఆ సమయంలో వాడిన బాష తీవ్ర అభ్యంతరకరమని హైకోర్టులో పిటీషన్ వేసాడు.. ఇది తన ఒక్కరి సమస్యే కాదని , ప్రతి ఒక్కరి సమస్య అని చెప్పారు. దీనిపై కోర్టు విచారించి , పోలీసులు ప్రజలపట్ల సంస్కారవంతమైన బాష వాడాలని చెప్పారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్