డియర్ ,కేటీఆర్ సర్ ..వాటీజ్ దిస్ ..

  0
  361

  ఇదెక్కడి న్యాయం కేటీఆర్ సర్.. అనసూయ ఆవేదన

  బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఆమె సామాజిక సమస్యలపై కూడా చురుగ్గా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆమె నేరుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న వేశారు.

  ‘కేటీఆర్‌ సర్‌.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్‌ ఫాలో అయ్యాం. దేశవ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా సాగుతోంది. కానీ, వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా త‌మ‌ది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్‌ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్‌.. ఇదెక్కడి న్యాయం? ఎప్పటిలాగా ఈ విషయాన్ని కూడా మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను’’ అని అనసూయ ట్వీట్‌ చేశారు.

  క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అన్ని వ్య‌వ‌స్థ‌లు క్ర‌మంగా గాడిన ప‌డుతున్నాయి. అయితే పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయ‌క‌పోవ‌డం, మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కుంది. ఆ ఆందోళ‌నను తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు అనసూయ. మరి దీనికి కేటీఆర్ స్పందన ఏంటనేది వేచి చూడాలి.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..