అతడికే బిడ్డను కన్నాను.. శ్రీయ.

  0
  1071

  హీరోయిన్ శ్రియ అభిమానులందరికీ షాకిచ్చింది. ఆ మాటకొస్తే దాదాపు ఆమె గురించి తెలిసినవారంతా ఆ వార్త విని షాకయ్యారు. శ్రియకు 2018లో పెళ్లైందని చాలామందికి తెలుసు, కానీ ఆమె తాను గర్భం దాల్చానని కానీ, బిడ్డను కనబోతున్నట్టు కానీ ఎక్కడా చెప్పలేదు. కట్ చేస్తే తాజాగా తన బిడ్డతో కలసి దిగిన ఫొటోలు బయటపెట్టింది. అసలేం జరిగింది, శ్రియ ఇంత జాగ్రత్తగా ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది.

  ఆమధ్య వరసబెట్టి గుడులకు, గోపురాలకు తిరుగుతుంటే ఏంటో కథ అనుకున్నారు కానీ, ఇలా తన బిడ్డను తీసుకొచ్చిందని తెలిసి అందరూ షాకయ్యారు. సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా తన అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ పర్సనల్ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తారు. ఇప్పుడు శ్రియ కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాన్ని సీక్రెట్ గా ఉంచి వార్తల్లోకెక్కింది. 2018 లో తన ప్రియుడు ఆండ్రీ కొఛీవ్ ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉండే శ్రియాశ‌ర‌ణ్ తాను గర్భం దాల్చి పాపకు జన్మినిచ్చిన సంగతి మాత్రం బయట పెట్టలేదు. సాధారణంగా ఏదైనా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే వాటిలో బాడీని చూసి ఏమైనా తేడాలు ఉన్నాయేమో ఇట్టే పసిగడతారు అభిమానులు, అందుకే చాలా తెలివిగా అలాంటి అనుమానం కలిగించే ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు శ్రియ.

  అప్పటికే తన దగ్గర ఉన్న పాత వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను మాయ చేసింది. అయితే ఆమె తల్లయిన సంగతి బయటికి కూడా రాకుండా ఏడాది పైగా దాచేసిన శ్రియ ఇప్పుడు తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అభిమానులతో పంచుకుంది. తాను తల్లైన విషయం గురించి చెబుతూ 2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసిందని, కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిపోగా తమ జీవితాలలో మాత్రం ఓ అద్భుతం జరిగిందని చెప్పుకొచ్చింది. దేవుడు మాకు ఒక ఏంజిల్‌ లాంటి చిన్నారిని ప్రసాదించాడని, అందుకు నా భర్తకు రుణపడి ఉంటానని శ్రియ పేర్కొంది. చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగిందని చెబుతూ భర్తతో పాపా ఆడుకుంటున్న వీడియోను షేర్ చేసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..