సినిమా టికెట్ రేట్లపై హీరో నిఖిల్ ఏమన్నాడంటే?

    0
    364

    సినిమా టికెట్ రేట్లపై ఆల్రడీ హీరో నాని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. ఆ తర్వతా మరో హీరో సిద్ధార్థ్ ఏదో కామెంట్ చేసి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. తాజాగా మరో హీరో నిఖిల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. నిఖిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధాకరమన్నాడు నిఖిల్. ఏపీలో చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ రేటు రూ.20గా ఉందని.. రైలులో కంపార్టుమెంట్ల ఆధారంలో ప్రీమియం లేదా ఫ్లెక్సిబుల్ రేట్లను ఎలా అనుమతిస్తున్నారో సినిమా థియేటర్లలోనూ బాల్కనీ, ప్రీమియం విభాగాల్లో ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్లను అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు.

    థియేటర్లు తనకు దేవాలయంతో సమానమని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ప్రజలకు థియేటర్లు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయన్నాడు. సినిమా పరిశ్రమను ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిఖిల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..