మద్యం తాగితే లివర్ సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. అది కూడా పరిమితికి మించి తాగే వారిని లివర్ ప్లాబ్లమ్స్ తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. గుండె సంబంధిత వ్యాధులకు మద్యపానానికి నేరుగా సంబంధం ఉందని చెప్పడం కాస్త కష్టమే. కానీ అరిద్ మియా అనే సమస్యకు కేవలం మద్యపానమే కారణం అంటున్నారు వైద్యులు.
అరిద్ మియా… గుండె లయను ప్రభావితం చేసే ఓ సమస్య ఇది. గుండెపోటుకు ఓ ముఖ్య కారణం కూడా. వృద్ధాప్యం, ఊబకాయం, మధుమేహం… వీటన్నిటి వల్ల కూడా అరిద్ మియా వస్తుంది కానీ.. మద్యపానం అనేది దీనికి ప్రధాన కారణం అని తేలింది. కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం, కుడివైపుకి తిరిగి పడుకోవడం, భుక్తాయాసం, మద్యం సేవించడం… వీటిలో ఏ అలవాటు అరిద్ మియాను బాగా పెంచుతుందో అనే దానిపై ఓ పరిశోధన జరిగింది. ఇందులో తేలిందేంటంటే.. మద్యపానం అనేది అరిద్ మియా సమస్యకు మూల కారణం అని తేలింది. కొత్త ఏడాది మందు ముట్టను అని ఒట్టు పెట్టుకునే వారంతా దానికి కట్టుబడి ఉంటండి. మందు ముట్టకండి, గుండె సమస్యలు కొని తెచ్చుకోకండి.