శిథిలాల్లో దారుణాలు..అధికారులకు కన్నీళ్లు.

    0
    559

    కొన్ని దృశ్యాలు చూస్తే , జీవితకాలం అవి నీడలా వెంటాడుతాయి..నీళ్లురాని కళ్ళకూ కన్నీళ్లు తెప్పిస్తాయి..కేరళలో , భారీ వర్షాల విధ్వంసంలో , కూలిపోయిన ఇళ్లల్లో శిధిలాలను తొలగిస్తుంటే , ఆ పనిలో ఉన్న సిబ్బంది , పెద్దగా ఏడుస్తున్నారు.. కొన్నిచోట్ల ఆ హృదయవిదారక దృశ్యాలు చూసి , సొమ్మసిల్లి పడిపోతున్నారు..మిలిటరీ , పోలీసు అధికారులు ఇలాంటి దృశ్యాలు చూసి అన్నం కూడా తినడంలేదు..

     

    ఇడుక్కి జిల్లా కొక్కయ్యర్ గ్రామంలో , ఒక ఇంటి శిధిలాలు తొలగిస్తుంటే , ముగ్గురు బిడ్డలు , ఒకరినొకరు కౌగలించుకొని చనిపోయిన దృశ్యం కలచివేసింది. వీరిని అమ్న , అస్ఫాన్ , అహియాన్ గా గుర్తించారు. వారికీ , వరుసగా 8, 7, 4 సంవత్సరాల వయసుంది. మరో ఇంటి శిధిలాలు తొలగిస్తుండగా , ఊయలలో చనిపోయి , ఉన్న పాప శవం వెలికితీశారు.

    మరో ఇంటి శిథిలాల్లో ఒక తల్లి , బిడ్డను కౌగలించుకొని ఉంది.. తల్లిని 28 ఏళ్ల ఫౌజియా గా , బిడ్డను పదేళ్ల అమీన్ గా గుర్తించారు. తమ ఇంటిని చుట్టుముడుతున్న వరదనీటిని వీడియో తీసి , ఫౌజియా బందువులకు పంపిన కొద్దిసేపటికే , ఆమె ఇల్లు కూలిపోయింది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..