చీర కట్టుకుంటే రెస్టారెంట్ లోకి ప్రవేశంలేదన్న ఢీల్లీ సంఘటన సంచలనం సద్దుమణుగుతున్న నేపథ్యంలో , మరో రెస్టారెంట్ విచిత్రమైన ఆంక్షలతో వార్తలకెక్కింది., రాజస్థాన్ లోని జైపూర్ లో , ఓ రెస్టారెంట్ లో , లేడీస్ తోడులేకుండా , రెస్టారెంట్ లోకి ప్రవేశంలేదన్న బోర్డు నివ్వెరపోయేట్టు చేస్తోంది. ఈ రెస్టారెంట్ లో రోటీ , దాల్ చాలా బాగుంటుందట .. రెస్టారెంట్ లోని ఎసి యూనిట్లపై ఇలా రాసి ఉంది.. దయచేసి ఆడ తోడులేకుండా లోపలకి రావద్దు..అని. ఈ సందర్భంగా ఓ అమ్మాయి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. రెస్టారెంట్ లో రోటి , దాల్ కోసం , ఓ వ్యక్తి తనను తోడుతెచ్చుకున్నాడని చెప్పడంతో , నెటిజన్లు కామెంట్లతో ఆడుకుంటున్నారు..