చెన్నైలో నీటి కొరత ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. నీళ్ళ బాటిల్ కూడా వంద రూపాయలు పెట్టి కొంటుంటారు. అంతలా నీటి కొరత ఉంటుంది. అయితే బంగాళాఖాతంలో కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం తడిసి ముద్దయింది. వర్షాలు కురుస్తున్నప్పుడు సరే… వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ నీటి కొరత తప్పుదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఐదు డ్రమ్ములు వర్షపు నీటిలో పెట్టాడు. వర్షాలతో ఆ డ్రమ్ములన్నీ నిండిపోయాయి.
ఆ డ్రమ్ములను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని, ఏడాది పాటు ఈ నీటినే తాగునీటిగా వినియోగించుకుంటానని చెబుతున్నాడు. వర్షపు నీటిని రోజు ఫిల్టర్ చేసుకుని, ఈ మంచినీటినే తాగుతానని చెప్పాడు. వర్షపు నీటిని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపాడు. మొత్తానికి అతని ఐడియా అదిరింది కదా.