బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి..

    0
    59

    భారత్ లో బంగారు ఆభరణాల అమ్మకాలకు కేంద్రం హాల్ మార్క్ తప్పనిసరి చేసింది. గతంలో హాల్ మార్క్ ఆభరణాలను కొన్ని చోట్ల అమ్ముతున్నా.. ఇప్పుడు దేశంలోని 256 జిల్లాల్లో హాల్ మార్క్ అమ్మకాలను తప్పనిసరి చేసింది కేంద్రం. భారత్ లో దాదాపు 4లక్షల బంగారు ఆభరణాల షాపులుండగా వీటిలో.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ బీఐఎస్ సర్టిఫికెట్ ఉన్నవి కేవలం 35,879మాత్రమే. ఇకపై వీటితోపాటు మిగతా షాపుల్లో కూడా కేవలం హాల్ మార్క్ ఆభరణాలు మాత్రమే అమ్మాల్సి ఉంది. 40లక్షల రూపాయల పైన టర్నోవర్ ఉండే షాపులు మాత్రమే ఈ హాల్ మార్క్
    హాల్ మార్క్ అంటే ఏంటి..?
    బంగారు నాణ్యతకు ప్రామాణికం హాల్ మార్క్. బంగారం 18 క్యారెట్లు అయినా, 22 క్యారెట్లు అయినా దాని స్వచ్ఛతను హాల్ మార్క్ నిర్థారిస్తుంది. పెద్ద పెద్ద షాపుల్లో కేవలం హాల్ మార్క్ ఆభరణాలనే అమ్ముతుంటారు. చిన్న షాపుల్లో హాల్ మార్క్ లేకుండా తీసుకున్న ఆభరణాలను, పెద్ద షాపుల్లో ఎక్సేంజ్ చేసుకునే విషయంలో ఇదే పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇకపై హాల్ మార్క్ లేకుండా అమ్మకాలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జూన్ 15నుంచి హాల్ మార్క్ అమలులోకి రాగా.. ఆగస్ట్ నుంచి హాల్ మార్క్ లేకుండా అమ్మే షాపులపై జరిమానా విధించబోతున్నారు.
    హాల్ మార్క్ వల్ల వినియోగదారుడికి తాను కొంటున్న బంగారం స్వచ్ఛతపై మరింత భరోసా ఉంటుంది. బంగారాన్ని తిరిగి అమ్మే సమయంలో కూడా దానికి తగిన రేటు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం వినియోగదారుల వద్ద ఉన్న పాత బంగారాన్ని షాపులకు తిరిగి అమ్మే సమయంలో హాల్ మార్క్ తప్పనిసరి కాదు అనే వెసులుబాటు ఇచ్చారు.
    ప్రస్తుతం దుబాయ్, సింగపూర్ లాంటి ప్రాంతాలు బంగారు కొనుగోళ్లకి ముఖ్యమైన మార్కెట్లు. భారత్ లో కూడా హాల్ మార్క్ తప్పనిసరి చేస్తే, మన మార్కెట్ కి ఆ స్థాయి వస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..