కొవిడ్ తగ్గాక జుట్టు రాలిపోతోందా.? ఇలా చేయండి

    0
    235

    కరోనా తగ్గిన తర్వాత చాలామందిలో సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతున్నాయి. కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వీటితోపాటు ఇప్పుడు కొత్తగా జుట్టు ఊడిపోయే సమస్య కూడా మొదలవుతోందట. కొవిడ్ కేవలం ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీద కూడా ఆ వైరస్ జాలి చూపటం లేదని అంటున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం.

    కరోనాతోనే కాదు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లన్నీ జుట్టు ఊడిపోవటానికి దారితీసేవే. ఇటీవల చాలామంది కొవిడ్‌-19 బారినపడటం వల్ల ప్రస్తుతం ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. వైరస్‌ కారణంగా భయాందోళనలతో తలెత్తే ఒత్తిడి, సరిగా తినకపోవటం వల్ల పోషకాల లోపం.. ఇవన్నీ వెంట్రుకలకు శాపంగా మారుతున్నాయి. అయితే దీనికి ప్రత్యేక మైన చికిత్స ఏదీ అవసరం లేదని, ఒత్తిడి తగ్గించుకుని, పోషకాహారం తింటే.. ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

    “ఇన్‌ఫెక్షన్లతో జుట్టు ఊడిపోతే పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. చాలావరకు జుట్టు తిరిగి వస్తుంది. కాకపోతే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. మొత్తం జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేస్తుందేమోనని డాక్టర్ల దగ్గరికి పరుగెడుతుంటారు. అంత భయం అవసరం లేదు. మంచి పోషకాహారం తీసుకుంటూ, తగు వ్యాయామం చేస్తే చాలు. శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇవి జుట్టు త్వరగా మొలవటానికి, పెరగటానికి తోడ్పడతాయి. ఎవరికైనా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయక పోవటం, విటమిన్ల లోపం వంటివి ఉన్నట్టయితే వెంట్రుకలు త్వరగా మొలవవు. ఇలాంటివారికి బయాటిన్‌, ఐరన్‌, జింక్‌, విటమిన్‌ డి3, విటమిన్‌ బి12, ప్రొటీన్‌, అమైనో ఆమ్లాలతో కూడిన మాత్రలు అవసరమవుతాయి. కొందరికి మినాక్సిడిల్‌ లోషన్‌ ఉపయోగపడుతుంది. ఇది మాడుకు రక్త ప్రసరణ పెరిగేలా చేసి, వెంట్రుకలు త్వరగా పెరిగేలా చేస్తుంది. మినాక్సిడిల్‌ లోషన్‌ పడనివారికి పెప్టైడ్‌ సీరమ్‌లు ఉపయోగపడతాయి. వీటిని ఉదయం, సాయంత్రం ఒక మిల్లీలీటరు చొప్పున తల మీద చల్లుకొని మర్దన చేసుకోవాల్సి ఉంటుంది.” అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..