అబ్బాయిలిద్దరి మధ్య ప్రేమ ఒకరి హత్యకు దారితీసింది..

  0
  278

  ఇద్దరు స్వలింగ సంపర్కులమధ్య అనైతిక బంధం ఒకరి హత్యకు దారితీసింది. అబ్బాయిలిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. స్వలింగ సంపర్కులయ్యారు. వీరిలో ఒకరు సుదర్శన్ .. పిహెచ్ డి స్కాలర్. మరొకరు రవిరాజ్ క్షీరసాగర. ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్నాడు. ఇద్దరికీ గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. అనైతిక సంబంధం ఏర్పడింది. ఈ లోగా సుదర్శన్ కి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న రవిరాజ్ పెళ్లి చేసుకోకుండా తనతో సంబంధం కొనసాగించాలని వత్తిడి తెచ్చాడు. కానీ తానూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని సుదర్శన్ చెప్పాడు.

  దీంతో కక్ష పెంచుకున్న రవిరాజ్ తననుంచి విడిపోతున్న రవిరాజ్ ని చంపాలని ప్లాన్ చేసాడు. పూణే లోని ల్యాబ్ లో పరిశోధన చేస్తున్న సుదర్శన్ ని , రవిరాజ్ కత్తితో పొడిచి చంపేశాడు. తరువాత రాళ్లతో కొట్టి తలను ఛిద్రం చేశాడు. ఇంటికెళ్లి తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు .ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు . తమ స్వలింగ సంపర్క సంబంధాన్ని కాదని ,సుదర్శన్ వేరే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని , అందుకే చంపేశానని అన్నాడు.. పోలీసులు రవిరాజ్ ని అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?