అక్రమసంబంధం ఉంటే ఉద్యోగంనుంచి తీసేస్తారా.. ?

  0
  85

  అక్రమ సంబంధం ఉందన్న కారణంగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం, లేదా తొలగించడం చట్ట విరుద్ధమని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధం లేదా, అక్రమ సంబంధం, సమాజం దృష్టిలో అనైతికమైన చర్యే అయినప్పటికీ, దాన్ని దుష్ప్రవర్తనగా భావించకూడదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కు ఉద్యోగంలోనుంచి తీసివేసిన 9 సంవత్సరాలకు జీతం కూడా చెల్లించి, కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.

  పోలీస్ సర్వీస్ రూల్స్ లో దుష్ప్రవర్తన అన్న పదమే ఉంటంది తప్ప, అనైతికత కారణంగా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం అనైతిక చర్యే తప్ప, దుష్ప్రవర్తన కాదని బావించాలని చెప్పింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ కు ఒక వితంతువుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు అంది, ఉద్యోగం నుంచి తొలగించారు.

  అది అతని వ్యక్తిగత విషయమే తప్ప పోలీస్ గా ఆయన విధి నిర్వహణలో లేదా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేది కాదని, స్పష్టం చేశారు. వాళ్లిద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నప్పుడు దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖకు ఏమిటని కూడా ప్రశ్నించింది. ఆ మహిళ కూడా అభ్యంతరం చెప్పలేదని, విధి నిర్వహణలోనూ, వృత్తిపరంగానూ ఆయన ఎటువంటి పొరపాటు చేయలేదని పేర్కొంది. వితంతువు కుటుంబానికి సంబంధించినవారు ఫిర్యాదు చేశారన్న ఒకే ఒక్క కారణంపై ఉద్యోగం నుంచి తొలగించడం, మంచి పద్ధతి కాదని, చెప్పింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..