గోల్ చేప కిలో లక్ష రూపాయలు..వలలో పడ్డాయి..

    0
    1664

    ఒక్క రోజులో అదృష్టం అందలమెక్కింది.. చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడికి చేపల రూపంలో ఒక కోటి 33 లక్షలరూపాయలు డబ్బులు వచ్చిపడ్డాయి.. దీనికి కారణం అతడివలలో పడిన గోల్ చేపలే.. 137 గోల్ చేపలు వలలో పడటంతో , రేవుకు తెచ్చిన నిమిషాల్లో వాటిని 1 కోటి 33 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని పాల్గర్ తీరంలో వ్వాద్వాన్ గ్రామంలో ఇది జరిగింది.. సముద్రంలో 25 మైళ్ళ దూరంలో చంద్రశేఖర్ తన ట్రాలీలో వేటకెళ్ళాడు.. అయితే అనుకోకుండానే , ఆ రోజు వలలో గోల్ చేపలు పడ్డాయి..

    గోల్ చేపలకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. సింగపూర్ , మలేషియా , ఇండోనేషియా ,హాంకాంగ్ , థాయిలాండ్ తదితర దేశాలలో గోల్ చేపలను యెంత ధరైనా కొంటారు. గోల్ చేపలకు మెడికల్ గా డిమాండ్ ఎక్కువ.. దీని మొప్పలనుంచి ఆపరేషన్ లో కరిగిపోయే కుట్లుకు దారం చేస్తారు.. శరీరంలో లోపల భాగంలో ఈ దారం వాడుతారు. సింగపూర్ లో ఖరీదైన వైన్ శుద్ధికి ఫ్యాక్టరీలలో గోల్ చేప నూనె వాడుతారు. దీని సముద్ర బంగారం అనికూడా పిలుస్తారు.. సాధారణంగా సముద్రం అడుగుభాగంలో ఉండే గోల్ చేప , చంద్రశేఖర్ అదృష్టం పండి , అతడి వలలో పడింది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్