18 నెలల్లో,4 సార్లు పాజిటివ్, కరొనతో డాక్టర్ ఛాలెంజ్.

    0
    341

    కరోనా అతడిని వదలడంలేదా..? కేరళలో ఓ డాక్టర్ కు ఒకటిన్నర సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.. మల్లాపురం జిల్లా మంజేరి , మెడికల్ కాలేజీలో డాక్టర్ అబ్దుల్ గఫార్ పనిచేస్తున్నాడు. గత ఏడాది జాలై నెలలో ఆయనకు మొదటసారి కోవిద్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. మందులు తీసుకుంటూ , ఇంట్లోనే 14 రోజులు ఉన్నతరువాత నెగెటివ్ వచ్చింది.. తర్వాత అదే ఏడాది డిసెంబర్ నెలలో ఆయనకు మళ్ళీ పాజిటివ్ నిర్దారణ అయింది.. కొంచెం ఇబ్బందిగానే ఉండటంతో , హాస్పిటల్లో చేరి , ఆరోగ్యం కుదురుగా ఉన్నతరువాత ఇంటికెళ్ళాడు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ డ్యూటీలో చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోవిషీల్డ్ మోదాడు డోస్ వాక్సిన్ వేసుకున్నాడు.

    ఏప్రిల్లో రెండో డోస్ వేసుకున్నాడు. రెండో డోస్ వేసుకున్న 10 రోజులకు , మూడో దఫా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వ్యాధి నయంచేసుకొని నెగెటివ్ వచ్చిన తరువాత జూన్ లో మళ్ళీ డ్యూటీలో చేరాడు.. ఈ దఫా ఆగస్టు మొదటి వారంలో మళ్ళీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.. ఈ దఫా వ్యాధి బాగా ముదరండంతో హాస్పిటల్లో చేరి బాగయ్యాడు.. మళ్ళీ నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు.. ఎన్ని దఫాలు కరోనా అటాక్ అయినా , ఆయన హాస్పిటల్లో కరోనా వార్డులోనే చేసేందుకు ఇష్టపడుతున్నాడు.. తనకు వ్యాధినిరోధక శక్తి తక్కువని , అందువల్లనే తరచుగా కరోనా వైరస్ అటాక్ చేస్తోందని డాక్టర్ గఫార్ చెప్పారు. ఆయనకు ఇప్పుడు ఇమ్మ్యూనిటీ పరీక్షలు చేస్తున్నారు. ఇమ్మ్యూనిటీ తక్కువని తేలితే ఆయనను కోవిద్ డ్యూటీనుంచి తప్పిస్తామని చెప్పారు. అయితే గఫార్ మాత్రం తనకు కొవిడ్ వార్డులో సేవ చేయడమే ఇష్టమని చెబుతున్నాడు..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్