అదే జరిగింది..బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు.

  0
  68759

  మళ్ళీ అదే జరిగింది..
  బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు..
  ===================
  చరిత్రలో కొన్ని సంఘటనలను కొందరు ముందుగానే ఊహిస్తూ ఉంటారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కొందరు కళ్ళకు కట్టినట్టుగా ముందే చెప్పేస్తుంటారు. ఆలాంటి వారిలో బ్రహ్మం గారు కూడా ఒకరు. ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పిన చాలా సంఘటనలు జరిగాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే ఎన్నోసంఘటనలు జరుగడంతో మనదేశంలో ఆయనను అందరూ విశ్వసిస్తారు. తాజాగా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన మరొక విషయం ఇప్పుడు నిజమైంది.

  అస్సాంలోని కచార్ జిల్లా గంగాపూర్ అనే గ్రామంలో ఓ మేక ఇటీవల విచిత్ర ఆకారంతో ఉండే జీవికి జన్మనిచ్చింది. ఆ జీవిని పరిశీలనగా చూస్తే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పింది దీని గురించేనని నమ్మక తప్పదు. ఎందుకంటే ఆ మేక కడుపున పుట్టింది మనిషి ఆకారంలో ఉండే ఒక జీవి. అచ్చం మనిషి తలను పోలిన ఆ ఆకారానికి మనుషుల్లాగే రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి.

  సాధారణంగా ఏ మేక అయినా నాలుగు కాళ్లతో పుడుతుంది. మనిషికి, మేకకు అస్సలు సంబంధమే ఉండదు. అయితే ఇక్కడ మేక కడుపున మనిషి జన్మించడం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలుగకమానదు. దీనిని చూసేందుకు జనం ఇప్పుడు ఆ ఊరికి తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పింది ఏదీ తప్పు కాలేదంటూ కాలజ్ఞానంలోని విషయాలను చర్చించుకుంటున్నారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..